ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ (Pushpa 2) పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.1800 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి మెగా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ముఖ్యంగా హిందీ వెర్షన్‌లో ఈ యాక్షన్ డ్రామా రికార్డులను బద్దలుకొట్టి, రూ.800 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించడం విశేషం.
ఇప్పుడు ఈ క్రేజీ చిత్రం జపాన్ దేశంలో రిలీజ్‌కు సిద్ధమవుతోంది. జనవరి 16, 2026న జపాన్ థియేటర్లలో ‘పుష్ప 2’ (Pushpa 2) సందడి చేయనుండగా, ఇప్పటికే మేకర్స్ జపనీస్ ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. డబ్బింగ్ వెర్షన్ ప్రమోషన్స్‌లో భాగంగా అల్లు అర్జున్ జపాన్ మీడియాతో వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఆయనతో పాటు హీరోయిన్ రష్మిక మందన్న కూడా ప్రమోషన్స్‌లో పాల్గొంటోంది.
జపాన్‌లో ఈ చిత్రాన్ని గీక్ పిక్చర్స్, షోచికు సంస్థలు డిస్ట్రిబ్యూట్ చేయనున్నాయి. ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్, రావు రమేష్, జగపతి బాబు, అనసూయ భరద్వాజ్, సునీల్ కీలక పాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మెగా ప్రాజెక్ట్‌కు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, సామ్ సి.ఎస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను అందించారు.


