నిఖిల్ భారీ పీరియాడిక్ సినిమా వాయిదా పడిందా?

నిఖిల్ భారీ పీరియాడిక్ సినిమా వాయిదా పడిందా?

Published on Jan 21, 2026 11:12 AM IST

Swayambhu

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరోస్ లో నిఖిల్ సిద్ధార్థ్ కూడా ఉన్నారు. మరి నిఖిల్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే ‘స్వయంభు’. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ చిత్రంని దర్శకుడు భరత్ కృషామాచారి గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమా షూటింగ్ చాలా కాలంగా కొనసాగుతుండగా ఫైనల్ గా రిలీజ్ డేట్ ని కూడా వారు లాక్ చేశారు. ఇలా ఫిబ్రవరి 13న పాన్ ఇండియా లెవెల్లో విడుదలని ఫిక్స్ చేశారు. కానీ లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ సినిమా ఈ డేట్ నుంచి వాయిదా పడ్డట్టు తెలుస్తుంది. సినిమాకి ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు బాకీ ఉన్నందున ఈ వాయిదా అన్నట్టు టాక్.

కొంచెం ఆలస్యం అయ్యినా బెస్ట్ అవుట్ పుట్ నే మేకర్స్ అందించాలని చూస్తున్నారట. అందుకే ఫిబ్రవరి నుంచి మార్చ్ లేదా ఏప్రిల్ రిలీజ్ కి చూస్తున్నారని తెలుస్తుంది. మరి కొత్త డేట్ పై అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి సలార్ సంగీత దర్శకుడు రవి బసృర్ సంగీతం అందిస్తుండగా పిక్సెల్ స్టూడియోస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

తాజా వార్తలు