మొన్న‘ధురంధర్’.. నేడు ‘బోర్డర్ 2’.. ఎందుకీ విధంగా..?

మొన్న‘ధురంధర్’.. నేడు ‘బోర్డర్ 2’.. ఎందుకీ విధంగా..?

Published on Jan 22, 2026 5:10 PM IST

dhurandhar and Boarder 2

బాలీవుడ్‌లో గతేడాది రిలీజ్ అయిన ‘ధురంధర్’ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ బెస్ట్ పర్ఫార్మెన్స్‌తో ఇరగదీశాడు. ఇక ఈ సినిమాకు ప్రేక్షకులు పట్టం కట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాను స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా ఆదిత్య ధర్ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. పాకిస్థాన్ దేశానికి వ్యతిరేకంగా ఈ సినిమాలో కొన్ని అంశాలు ఉన్నాయనే కారణంతో ఈ చిత్రాన్ని యూఏఈ సహా పలు దేశాలు బ్యాన్ చేశారు.

బహ్రెయిన్‌, కువైట్‌, ఒమన్‌, ఖతార్‌, సౌదీ అరేబియాతోపాటు యూఏఈ కూడా ఈ చిత్రంపై బ్యాన్ విధించాయి. అయితే, ఈ నిషేధం ఆ సినిమా రన్‌ను ఏమాత్రం ఆపలేకపోయాయి. ఇక ఇప్పుడు మరోసారి ఇదే సీన్ రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. గతంలో 1997లో వచ్చిన బోర్డర్ చిత్రానికి సీక్వెల్‌గా ‘బోర్డర్ 2’ సినిమా దాదపు 28 ఏళ్ల తర్వాత రిలీజ్‌కు రానుంది. అయితే, ఇప్పుడు ఈ సినిమాను కూడా గల్ఫ్ దేశాల్లో బ్యాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

బోర్డర్ 2 చిత్రంలో పాకిస్థాన్ దేశానికి సంబంధించిన అంశాలు ఉన్నాయని.. అందుకే ఈ చిత్రాన్ని కూడా గల్ఫ్ దేశాల్లో బ్యాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో సన్నీ డియోల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా వరుణ్ ధావన్, దిల్జిత్ దొసాంజ్, అహాన్ శెట్టి తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ దేశభక్తి చిత్రాన్ని జనవరి 23న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

తాజా వార్తలు