లేటెస్ట్.. ‘ఇరుముడి’ నెక్స్ట్ సాంగ్ కి డేట్, టైం వచ్చేశాయ్!

లేటెస్ట్.. ‘ఇరుముడి’ నెక్స్ట్ సాంగ్ కి డేట్, టైం వచ్చేశాయ్!

Published on Aug 1, 2026 11:30 AM IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్ లో చేస్తున్న అవైటెడ్ చిత్రమే ‘ఇరుముడి’. తెలుగు సహా తమిళ్ లో కూడా విడుదలకి ప్లాన్ చేస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పుడు వరకు వచ్చిన ప్రతీ అప్డేట్ కూడా మంచి బజ్ ని రేకెత్తించాయి. అయితే ఈ సినిమా విడుదల ఇక దగ్గరకి వస్తున్న నేపథ్యంలో అప్డేట్స్ ని వరుసగా కోరుకుంటున్న ఫ్యాన్స్ కి ఫైనల్ గా మేకర్స్ నుంచి రెండో సాంగ్ అప్డేట్ వచ్చేసింది.

ఈ సాంగ్ ని ఈ ఆగష్టు 3న విడుదల చేస్తున్నట్టుగా ఓ బ్యూటిఫుల్ ఫ్యామిలీ పోస్టర్ తో రివీల్ చేశారు. యాలో యాలో అంటూ సాగే ఈ సాంగ్ ని మేకర్స్ ఈ 3న ఉదయం 11 గంటల 7 నిమిషాలకి విడుదల చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. సో ఇక నుంచి వరుసగా ఇరుముడి నుంచి అప్డేట్స్ వస్తాయి అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు