ప్రస్తుతం టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రం ‘వారణాసి’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్ట్ చేస్తుండటంతో అంచనాలు నెక్స్ట్ లెవెల్లో క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన అనౌన్స్మెంట్ గ్లింప్స్ సెన్సేషనల్ రెస్పాన్స్‌ను అందుకుంది. కాగా, ఈ సినిమాలో మహేష్ బాబు ‘రుద్ర’ అనే పాత్రలో నటిస్తున్నాడు.
ఇక తాజాగా ‘వారణాసి’ చిత్ర యూనిట్ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిత్ర టీమ్ పాల్గొన్నారు. ఈ క్రమంలో మహేష్ బాబు తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన పోకిరి చిత్రంపై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన కెరీర్లో ‘పోకిరి’ సినిమా చాలా ప్రత్యేకమైనదని.. ఆ సినిమా తన జీవితాన్ని పూర్తిగా మార్చిందని.. ఆ సినిమా తర్వాత ఏం చేయాలో తనకు తెలియలేదని మహేష్ చెప్పుకొచ్చాడు.
పోకిరి చిత్రం తనను స్టార్‌గా మార్చిందని మహేష్ చెప్పుకొచ్చాడు. ఇలా పోకిరి చిత్రంపై మహేష్ బాబు చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వారణాసి చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తుండగా కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తు్న్నారు. ఈ చిత్రాన్ని కె.ఎల్.నారాయణ, ఎస్.ఎస్.కార్తికేయ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.


