మెగా ఛాన్స్ కొట్టేసిన ‘ధురంధర్’ బ్యూటీ.. సారా అర్జున్ స్పీడ్ మామూలుగా లేదుగా..!

మెగా ఛాన్స్ కొట్టేసిన ‘ధురంధర్’ బ్యూటీ.. సారా అర్జున్ స్పీడ్ మామూలుగా లేదుగా..!

Published on Feb 4, 2026 8:02 PM IST

Mega-158

బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘ధురంధర్’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషనల్ హిట్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించగా అందాల భామ సారా అర్జున్ హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాలు చేసిన సారా అర్జున్ ఈ సినిమాతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇప్పుడు వరుసగా బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తోంది ఈ బ్యూటీ.

ఇప్పటికే టాలీవుడ్ దర్శకుడు గుణశేఖర్ డైరెక్షన్‌లో ‘యుఫోరియా’ అనే సినిమాలో సారా నటిస్తోంది. ఈ చిత్రం ఫిబ్రవరి 6న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. అయితే, ఇప్పుడు మరో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిందట ఈ బ్యూటీ. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో 158 చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు దర్శకుడు బాబీ. మెగా 158 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో మెగాస్టార్ కూతురి పాత్రలో తొలుత ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టిని తీసుకోవాలని భావించారట. కానీ, ప్రస్తుతం సారా అర్జున్ క్రేజ్‌తో ఇంప్రెస్ అయిన మేకర్స్ చిరు కూతురి పాత్రకు ఆమెను తీసుకోవాలని చూస్తున్నారట.

ఒకవేళ ఆమె నిజంగా ఈ సినిమాలో సెలెక్ట్ అయితే, ఆమె కెరీర్‌కు మంచి బూస్ట్ లభిస్తుందని చెప్పాలి. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన సీనియర్ హీరోయిన్ ప్రియమణి నటిస్తోందనే టాక్ వినిపిస్తోంది. మరి నిజంగానే ఈ మెగా ఆఫర్‌ను సారా అర్జున్ వినియోగించుకుంటుందా.? అనేది చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు