న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ది ప్యారడైజ్’ (The Paradise )షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘దసరా’ భారీ విజయం సాధించడంతో, ఈ ప్రాజెక్టుపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం శంషాబాద్‌లో వేసిన భారీ సెట్స్‌లో నానిపై ఒక గ్రాండ్ ఇంట్రొడక్షన్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ పాట సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం.
ఈ సినిమాలో నాని జడల్ అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక మార్చి 26న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రాన్ని 2026 జూలై 25న విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. ఈ సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా మోహన్ బాబు, సోనాలి కులకర్ణి, బాబు మోహన్, తనికెళ్ళ భరణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.


