‘అనగనగా ఒక రాజు’ ఓటీటీ రిలీజ్ డేట్ అదే !

‘అనగనగా ఒక రాజు’ ఓటీటీ రిలీజ్ డేట్ అదే !

Published on Feb 8, 2026 11:11 AM IST

Anaganaga Oka Raju

నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga Oka Raju). ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసి భారీ కలెక్షన్స్ ను రాబట్టింది. కాగా ఈ చిత్రం ఫిబ్రవరి 11, 2026న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ అవుతుందని మేము ఇంతకు ముందు అప్ డేట్ ఇచ్చాం. ఇప్పుడు ఆ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఓ పోస్ట్ ద్వారా ఈ తేదీని అధికారికంగా వెల్లడించింది. ఈ చిత్రం పాన్-ఇండియా స్థాయిలో ఓటీటీలో విడుదల కానుంది, హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషలలో డబ్బింగ్ వెర్షన్లు కూడా స్ట్రీమ్ కానున్నాయి.

నవీన్ పొలిశెట్టి మార్క్ కామెడీ టైమింగ్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేశారు. రావు రమేష్, తారక్ పొన్నప్ప, చమ్మక్ చంద్ర మరియు గోపరాజు రమణ కీలక సహాయ పాత్రలలో నటించారు.

తాజా వార్తలు