నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga Oka Raju). ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసి భారీ కలెక్షన్స్ ను రాబట్టింది. కాగా ఈ చిత్రం ఫిబ్రవరి 11, 2026న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ అవుతుందని మేము ఇంతకు ముందు అప్ డేట్ ఇచ్చాం. ఇప్పుడు ఆ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఓ పోస్ట్ ద్వారా ఈ తేదీని అధికారికంగా వెల్లడించింది. ఈ చిత్రం పాన్-ఇండియా స్థాయిలో ఓటీటీలో విడుదల కానుంది, హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషలలో డబ్బింగ్ వెర్షన్లు కూడా స్ట్రీమ్ కానున్నాయి.
నవీన్ పొలిశెట్టి మార్క్ కామెడీ టైమింగ్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేశారు. రావు రమేష్, తారక్ పొన్నప్ప, చమ్మక్ చంద్ర మరియు గోపరాజు రమణ కీలక సహాయ పాత్రలలో నటించారు.
Raju gaari pellante yedu tharalu atu itu gurthundipovali 😎❤️ pic.twitter.com/LqlLrYZ4N4
— Netflix India South (@Netflix_INSouth) February 8, 2026


