‘కొరియన్‌ కనకరాజు’ పై లేటెస్ట్ అప్ డేట్ !

‘కొరియన్‌ కనకరాజు’ పై లేటెస్ట్ అప్ డేట్ !

Published on Feb 9, 2026 8:02 PM IST

Korean-Kanakaraju

మెగా హీరో వరుణ్‌ తేజ్‌ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘కొరియన్‌ కనకరాజు’(Korean Kanakaraju) సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన యంగ్ బ్యూటీ రితికా నాయక్‌ హీరోయిన్‌ గా నటిస్తోంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ కోసం ఓ స్పెషల్ పోలీస్ స్టేషన్ సెట్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సెట్ లో వరుణ్ తేజ్ పై ఎంట్రీ సాంగ్ ను షూట్ చేస్తారట. ఈ సాంగ్ లో వరుణ్ తేజ్ తో పాటు మరో హీరోయిన్ కూడా కనిపిస్తోందని తెలుస్తోంది.

అన్నట్టు, ఈ సినిమాలో వరుణ్‌ తేజ్ కనకరాజు పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఆ మధ్య విడుదలైన గ్లింప్స్‌లో వరుణ్ తేజ్ ‘నేను తిరిగొచ్చేశా’ అంటూ కొరియన్‌ భాషలో చెప్పడం ఆకట్టుకుంది. ఇంతకీ, ఈ సినిమాకి కొరియన్ భాషకు ఏమిటి సంబంధం అనేది ? సినిమాలో చాలా ఆసక్తిగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. వేసవిలో ఈ సినిమా విడుదల కానుంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని సాధిస్తోందో చూడాలి.

తాజా వార్తలు