యూనివర్సల్ నటుడు కమల్ హాసన్ హీరోగా ఇప్పుడు పలు సినిమాలు చేస్తున్నారు. మన తెలుగులోనే భారీ చిత్రం ‘కల్కి 2898 AD’ లో విలన్ గా తాను నటిస్తున్నారు. అయితే రీసెంట్ గా కమల్ హాసన్ చేసిన ఓ స్టేట్మెంట్ ముఖ్యంగా మన తెలుగు ఆడియెన్స్ లో వైరల్ గా మారింది.
రాజ్యసభలో జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయ్ అనే లైన్స్ చెబుతూ ఏ ప్రభుత్వం కూడా శాశ్వతంగా లేదు అంటూ కామెంట్స్ చేశారు. అయితే దీనిపై లేటెస్ట్ గా తమ కోలీవుడ్ నటి కస్తూరి అందుకు కౌంటర్ ఇవ్వడం జరిగింది. కమల్ కి ఎవరైతే సపోర్ట్ చేసారో చాలా మందికి ఆయనేం చెప్పారో కూడా అర్ధం కాలేదు అని అంతే కాకుండా కమల్ తెలుగు వారిని పట్టించుకోలేదు అన్నట్టు ఆమె చెప్పడం వైరల్ గా మారుతుంది.
అయితే ఈ ఇద్దరూ భారతీయుడు సినిమాలో తండ్రీ కూతుళ్లు, అన్న, చెల్లెళ్లుగా నటించిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు పరిస్థితులు ఇలా మారాయి. మరి దీనిపై కమల్ ఏమన్నా స్పందిస్తారో లేదో చూడాలి.


