ఇంటర్వ్యూ : డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని – ‘కపుల్ ఫ్రెండ్లీ’ అన్ని వర్గాలను మెప్పిస్తుంది..!

ఇంటర్వ్యూ : డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని – ‘కపుల్ ఫ్రెండ్లీ’ అన్ని వర్గాలను మెప్పిస్తుంది..!

Published on Feb 11, 2026 11:31 PM IST

Dheeraj-Mogilineni

యువ హీరో సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ “కపుల్ ఫ్రెండ్లీ”. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ నిర్మించిన ఈ చిత్రం వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 14న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ చేస్తున్న ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని తాజాగా మీడియాతో ఈ చిత్రానికి సంబంధించిన విషయాలను పంచుకున్నారు.

– “కపుల్ ఫ్రెండ్లీ” సినిమాను ఇప్పటికే వీక్షించాను. మూవీ బాగా నచ్చింది. ప్రమోద్ అన్నకు వంశీ అన్నకు కాల్ చేసి ఈ సినిమా నేను డిస్ట్రిబ్యూట్ చేయాలని అనుకుంటున్నా అని అడిగాను. వారు ఓకే చెప్పడంతో ఈ ప్రాజెక్ట్ టేకప్ చేశాను. ఇది చెన్నై బ్యాక్ డ్రాప్ లో సాగే మంచి లవ్ స్టోరీ మూవీ.

– “కపుల్ ఫ్రెండ్లీ” మూవీలో లివ్ ఇన్ రిలేషన్ షిప్ గురించి కేవలం 15 నిమిషాలు మాత్రమే సీన్స్ ఉంటాయి. మిగతా అంతా మిత్ర, శివ అనే జంట ఒకరికొకరు పరిచయం అయ్యాక వారి జీవితాలు ఎలా మారాయి.

– హీరోయిన్ ప్రతి సందర్భంలో చెప్తాను చెప్తాను అని హీరోతో అంటూ ఉంటుంది. కొంచెం సస్పెన్స్ దాచేందుకే ఆమె అలా చెబుతుంటుంది. ఈ సినిమా టైటిల్ విషయంలో సెన్సార్ అభ్యంతరం చెప్పారు. టైటిల్ మార్చమని అన్నారు. కానీ మేము ఇప్పుడు టైటిల్ విషయంలో ఎలాంటి మార్పులు చేయలేమని చెప్పాం.

– “కపుల్ ఫ్రెండ్లీ”లో శివ పాత్రలో సంతోష్ శోభన్ పర్‌ఫార్మెన్స్ మనందరికీ చాలా నచ్చుతుంది. ఎంతో సెటిల్డ్ గా ఆయన నటించారు. సంతోష్ లాంటి యంగ్ హీరోలకు సక్సెస్ వస్తే వాళ్లు మరిన్ని మూవీస్ చేస్తారు. ఇండస్ట్రీ బాగుంటుంది.

– “కపుల్ ఫ్రెండ్లీ” ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉండే మంచి లవ్ స్టోరీ. ఈ చిత్ర దర్శకుడు అశ్విన్ చేసిన స్క్రిప్ట్ పర్పెక్ట్ గా ఉంది. ప్రతి సీన్ కు మరొక సీన్ తో లింకు ఉండేలా పక్కాగా స్క్రిప్ట్ చేసుకున్నారు. స్క్రిప్ట్ తో పాటు ఆ కథను అందరికీ నచ్చేలా తెరకెక్కించారు. డిస్ట్రిబ్యూషన్ చేస్తూ మూవీలో మార్పులు చెప్పడం కరెక్ట్ కాదు. ఇది డైరెక్టర్, హీరో, ప్రొడక్షన్ హౌస్ మొదటి నుంచి నమ్మి చేసిన కథ.

– ప్రస్తుతం చెన్నై లవ్ స్టోరీ షూటింగ్ జరుగుతోంది. సంగీత్ శోభన్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. అలాగే చిన్న పిల్లలతో ఓ చిల్డ్రన్ మూవీ చేస్తున్నాం. అది సమ్మర్ లో రిలీజ్ చేస్తాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు