నార్త్ లో ‘టాక్సిక్’ కోసం ‘పుష్ప 2’ డిస్ట్రిబ్యూటర్.. ‘ధురంధర్ 2’ కి గట్టి పోటీ ఖాయమా!

నార్త్ లో ‘టాక్సిక్’ కోసం ‘పుష్ప 2’ డిస్ట్రిబ్యూటర్.. ‘ధురంధర్ 2’ కి గట్టి పోటీ ఖాయమా!

Published on Feb 12, 2026 4:57 PM IST

Toxic

ఈ మార్చ్ నెలలో గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతున్న పలు బిగ్గెస్ట్ చిత్రాల్లో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా హీరోయిన్స్ నయనతార, కియారా అద్వానీ అలాగే హుమా ఖురేషి ఇంకా తారా సుతారియా లాంటి బ్యూటీల కలయికలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ చిత్రం “టాక్సిక్” (Toxic Movie) కూడా ఒకటి.

ఇక ఈ సినిమా సెన్సేషనల్ హిట్ చిత్రం ధురంధర్ కి సీక్వెల్ తో పోటీకి వస్తుండగా లేటెస్ట్ గా మేకర్స్ నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూటర్ ని అనౌన్స్ చేశారు. హిందీ మార్కెట్ లో ధురంధర్ 2 తో గట్టి పోటీ ఖాయం అని ఆల్రెడీ ఈ క్లాష్ పట్ల అంతా ఎగ్జైటెడ్ గా ఉన్నారు. మరి ఇలాంటి సినిమాని హిందీలో పుష్ప 2 లాంటి సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రముఖ సంస్థ ఏఏ వారు ముందుకొచ్చారు.

కేవలం ఉత్తర భారతదేశం లోనే కాకుండా నేపాల్ లో కూడా వీరు యష్ టాక్సిక్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. సో నార్త్ మార్కెట్ లో ధురంధర్ 2 కి మంచి పోటీ ఉంటుంది అని చెప్పొచ్చు. ఇక ఈ భారీ సినిమాకి రవి బసృర్ సంగీతం అందించగా కే వి ఎన్ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు