ఇంటర్వ్యూ : హీరోయిన్ మానస వారణాసి – ‘కపుల్ ఫ్రెండ్లీ’ అందరికీ కనెక్ట్ అవుతుంది..!

ఇంటర్వ్యూ : హీరోయిన్ మానస వారణాసి – ‘కపుల్ ఫ్రెండ్లీ’ అందరికీ కనెక్ట్ అవుతుంది..!

Published on Feb 12, 2026 6:06 PM IST

Manasa-Varanasi

సంతోష్ శోభన్, మానస వారణాసి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “కపుల్ ఫ్రెండ్లీ”. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 14న తెలుగు, తమిళంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ మానస వారణాసి మీడియాతో ముచ్చటించారు.

– ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా కొద్ది గంటల్లో రిలీజ్ కాబోతోంది. మేము కొన్ని నెలలు కష్టపడిన మూవీ ఇది. ఫైనల్ గా రిలీజ్ కు వస్తుందంటే మేమంతా చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాం. ఈ సినిమా డైరెక్టర్, ఇతర టీమ్ ను కలిశాక వీళ్లు మూవీ మేకింగ్ పట్ల ఎంత ప్యాషన్ తో ఉన్నారో తెలిసింది. వీళ్లొక మ్యాజిక్ క్రియేట్ చేయాలనుకుంటారని అర్థమైంది.

– ‘కపుల్ ఫ్రెండ్లీ’లో మిత్ర అనే క్యారెక్టర్ లో నటించాను. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆమె డిగ్రీ చేసి జాబ్ కోసం చెన్నై వస్తుంది. మిత్రకు చెప్తా చెప్తా అనే డైలాగ్ ఊతపదం. ఈ మూవీలో చాలాసార్లు ఆమె నుంచి ఈ మాట వింటారు.

– మనం ప్రేమ కథల్లో అమ్మాయి, అబ్బాయి కలవడం, లవ్ చేసుకోవడం లాంటివి చూస్తాం. కానీ “కపుల్ ఫ్రెండ్లీ”లో ఆ రొటీన్ ప్రేమ కథ ఉండదు. లివింగ్ టుగెదర్ అనేది నేను నా లైఫ్ లో ఎప్పుడూ ట్రై చేయలేదు. ఈ సినిమాలో మాత్రం ఆ కాన్సెప్ట్ ను కొత్తగా చూపిస్తున్నాం.

– కపుల్ ఫ్రెండ్లీ అనే మాటకు ఎన్నో అర్థాలు తీసుకోవచ్చు. పాజిటివ్ గా తీసుకుంటే శివ, మిత్ర కపుల్స్, వాళ్లు ఫ్రెండ్లీగా ఉంటారు అనుకోవచ్చు. ఈ సినిమాలో యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కు కూడా నచ్చే అంశాలుంటాయి. అందరికీ కనెక్ట్ అయ్యేలా సినిమా ఉంటుంది.

– నేను మిస్ ఇండియా పోటీలకు రెడీ అవుతున్న టైమ్ లోనే సినిమా అవకాశాలు వచ్చాయి. అప్పుడు నాకు అర్థం కాలేదు. మిస్ వరల్డ్ పోటీల నుంచి తిరిగి వచ్చాక ఇండస్ట్రీ పట్ల ఆకర్షణ పెరిగి ఆడిషన్స్ చేయడం, స్క్రిప్ట్స్ వినడం వంటివి చేశాను.

– ఈ మూవీలో క్లోజ్ గా ఉండే సన్నివేశాలు ఉంటాయి. కథ చెప్పినప్పుడే ఇది లవ్ స్టోరీ అని రెండు ముద్దు సీన్స్ ఉంటాయని చెప్పారు. సంతోష్ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఈ టీమ్ అంతా ఒక మ్యాజిక్ క్రియేట్ చేసేందుకు ట్రై చేస్తుంటే నటిగా నేనూ ప్రొఫెషనల్ గా ఉండాలి కదా అని నటించాను. రొమాంటిక్ సీన్స్ అయినా బ్యూటిఫుల్ గా పొయెటిక్ గా తెరకెక్కించారు.

– చెన్నై నగరంలో గెరిల్లా పద్ధతిలో షూట్ చేయడం కొత్త ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. అందరూ నడుస్తూ వెళ్తుంటారు. మేము మా సీన్స్ చేయాలి. కెమెరా ఎక్కడుందో తెలియదు. ఇలా సీన్స్ చేయడం కూడా యాక్టర్స్ గా కొత్తగా అనిపించింది. నెక్ట్స్ మూవీ కోలీవుడ్ లోనే చేస్తున్నా. తెలుగులో స్టోరీస్ వింటున్నా. కొంచెం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నా.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు