గ్రామీణ నేపథ్యంలో సాగే హార్ట్ టచింగ్ ఎమోషనల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘శ్రీ చిదంబరం గారు'(Sri Chidambaram Garu). నూతన దర్శకుడు వినయ్ రత్నం డెబ్యూ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో ఫిబ్రవరి 6, 2026న రిలీజ్ అయ్యింది. ప్రమోషన్ల పరంగా మంచి హైప్ క్రియేట్ చేసినప్పటికీ థియేటర్ల వద్ద మాత్రం మిశ్రమ ఫలితాన్ని అందుకుంది. పల్లెటూరి కథాంశంతో సాగే ఈ ఎమోషనల్ డ్రామా, అక్కడక్కడా మెప్పించినా పూర్తిస్థాయిలో ఆడియన్స్‌ను కనెక్ట్ చేయడంలో తడబడింది.
ఇక ఇప్పుడు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రన్ ముగియక ముందే అనూహ్యంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్ ఈ చిత్ర డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 19, 2026 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. థియేటర్లలో విడుదలైన కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఓటీటీలోకి రావడం సర్ప్రైజ్‌గా నిలిచింది.
వంశీ తుమ్మల ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో సంధ్య వశిష్ట హీరోయిన్‌గా మెరిసింది. తులసి, కల్పలత, గోపీనాథ్ వంటి సీనియర్ నటీనటుల పెర్ఫార్మెన్స్ సినిమాకు బలాన్ని చేకూర్చింది. థియేటర్లలో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్‌ను ఏ మేరకు అలరిస్తుందో వేచి చూడాలి.


