జైలర్ 2 : రిలీజ్ విషయంలోనూ సెంటిమెంట్ ఫాలో అవుతున్న టీమ్..?

జైలర్ 2 : రిలీజ్ విషయంలోనూ సెంటిమెంట్ ఫాలో అవుతున్న టీమ్..?

Published on Feb 14, 2026 11:05 AM IST

Jailer2

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్‌లో ‘జైలర్’ చిత్రం ఎలాంటి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాసింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జైలర్ 2’ తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావస్తోంది. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ పాత సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. ఈ సినిమాను జూన్ లేదా జులై నెలలో రిలీజ్ చేస్తారనే టాక్ జోరుగా వినిపిస్తున్నా… చిత్ర యూనిట్ మాత్రం ఆగస్టు నెలలో ఈ మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. జైలర్ చిత్రాన్ని ఇండిపెండెన్స్ డే కానుకగా 2023 ఆగస్టు 10న రిలీజ్ చేయగా, అది బ్లా్క్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు అదే సెంటిమెంట్‌తో 2026 ఆగస్టు 12 లేదా 14న ‘జైలర్ 2’ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

ఈ సినిమాలో రజినీకాంత్ మరోసారి తనదైన స్వాగ్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేయడం ఖాయమని మేకర్స్ అంటున్నారు. శివరాజ్ కుమార్, మోహన్ లాల్, షారుఖ్ ఖాన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ ఎప్పుడు ప్రకటిస్తారో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు