నిర్మాతగా కమల్ నెక్స్ట్ భారీ ప్రాజెక్ట్.. మళ్ళీ అమరన్ తోనేనా?

నిర్మాతగా కమల్ నెక్స్ట్ భారీ ప్రాజెక్ట్.. మళ్ళీ అమరన్ తోనేనా?

Published on Feb 14, 2026 9:05 PM IST

Kamal-Haasan

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ఇప్పుడు హీరో గానే కాకుండా నిర్మాతగా కూడా పలు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రాల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ తో కూడా ఓ భారీ సినిమా చేస్తుండగా ఇది కాకుండా ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ కి రంగం సిద్ధం అయ్యింది. తన నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ నుంచి రేపు ఓ భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తున్నట్టుగా సాయంత్రం 6 గంటల 1 నిమిషానికి కన్ఫర్మ్ చేశారు.

అయితే ఈ ప్రాజెక్ట్ దాదాపు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్ తోనే అని భావిస్తున్నారు. ఇది వరకే కమల్ నిర్మాణంలో శివ కార్తికేయన్ హీరోగా అమరన్ అనే భారీ బ్లాక్ బస్టర్ చేశారు. దాని తర్వాత మళ్ళీ వీరి కలయిక రిపీట్ అవుతుంది అన్నట్టు వినిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజం అనేది వేచి చూడాల్సిందే. రీసెంట్ గానే శివ కార్తికేయన్ ‘పరాశక్తి’ సినిమాతో పలకరించిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు