చిరు, బాబీ ప్రాజెక్ట్ లో ‘కన్నప్ప’ బ్యూటీ ఖరారేనా!

చిరు, బాబీ ప్రాజెక్ట్ లో ‘కన్నప్ప’ బ్యూటీ ఖరారేనా!

Published on Feb 14, 2026 10:00 PM IST

Mega 158

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు చేసిన చిత్రం మన శంకర వరప్రసాద్ గారు తర్వాత విశ్వంభర రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత తన బ్లాక్ బస్టర్ దర్శకుడు కొల్లి బాబీ కాంబినేషన్ లో చేస్తున్న సినిమా ఉంది. ఇంకా షూటింగ్ మొదలు కావాల్సిన ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాపై లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది.

దీనితో యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తుంది. ఇటీవల ‘కన్నప్ప’ సినిమాలో మెరిసిన ఈ యంగ్ హీరోయిన్ మెగాస్టార్ సినిమాలో చిరుకి కూతురు పాత్రలో ఈమె నటిస్తుంది అని సినీ వర్గాల్లో టాక్ వైరల్ గా మారింది. మరి దీనిపై అధికారిక క్లారిటీ బయటకి రావాల్సి ఉంది. ఇక ఈ భారీ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ ని సంగీతం కోసం లాక్ చేయాలని ప్లాన్ చేస్తుండగా కే వి ఎన్ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

తాజా వార్తలు