బన్నీ వాస్, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో సుహాస్, శివానీ నగరం ప్రధాన పాత్రల్లో నటించిన అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ ‘హే బలవంత్’ (గతంలో ‘హే భగవాన్’) ఫిబ్రవరి 20న విడుదల కానుంది. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్ విజనరీ స్టూడియోస్ మరియు నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, యాంకర్ స్రవంతి కీలక పాత్రలు పోషించారు. సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా హీరోయిన్ శివానీ నగరం తాజాగా మీడియాతో ముచ్చటించారు.
‘హే బలవంత్’ ఎలాంటి సినిమా?
నాది సుహాస్‌తో రెండో సినిమా. నా కెరీర్‌లో మూడో సినిమా. సుహాస్‌తో ఇంతకు ముందు చేసిన సినిమాలో చాలా ఇంటెన్స్ క్యారెక్టర్. ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ పాత్ర. చాలా ఎంజాయ్ చేస్తూ చేసిన పాత్ర నాది. చివర్లో ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ కూడా అందర్ని అలరిస్తుంది.
ఈ సినిమా ఒప్పుకుంటానికి రీజన్ ఏమిటి?
నాకు వచ్చిన కథలో దిబెస్ట్ పిక్ చేసుకుంటున్నాను. ఫస్ట్ సినిమాలో కామెడీలో లేదు. సెకండ్ సినిమాలో ఫుల్ కామెడీ. ఈ సినిమాలో కూడా కామెడీ ఉంది. వినగానే కథతో పాటు నా పాత్ర కూడా బాగా నచ్చింది.
ఈ సినిమాలో బిజినెస్ ఏమిటి? ఆ బిజినెస్‌తో మీకు ఏమైనా సంబంధం ఉంటుందా?
లేదండి.. అది సినిమాలో నరేష్ గారి ఫ్యామిలి బిజినెస్. అది నాకు సంబంధం లేదు. అది థియేటర్‌లో చూసి మీరు ఎంజాయ్ చేస్తారు. కడుపుబ్బా నవ్వుకుంటారు.
సుహాస్‌తో రెండో సినిమాలో చేయడం ఎలా అనిపించింది?
నాకు చాలా ఫ్రెండ్లీ, సపోర్ట్, చాలా మంచి నటుడు. ఈ సినిమాలో మా కాంబినేషన్ అలరిస్తుంది. మా ఇద్దరి మధ్య సన్నివేశాలను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు.
స్టార్ హీరోలతో ఆఫర్ వస్తే కథతో సంబంధం లేకుండా ఒప్పుకుంటారా?
సినిమా అంటే సినిమా. నాకు కథ, నా పాత్ర నచ్చితే ఒప్పుకుంటాను. ఎటువంటి నేపథ్యం లేకుండా వచ్చాను. ఆడియన్స్ ఇచ్చిన వాల్యూను నిలుపుకోవటమే ముఖ్యం.
పర్సనల్‌గా మీకు ఎలాంట సినిమాలు ఇష్టం?
అన్ని రకాల సినిమాలు చేయాలని, రొమాంటిక్ కామెడీ సినిమాలంటే చాలా ఇష్టం. మూడ్ అప్‌సెట్‌లో ఉన్న ఇలాంటి ఎంటర్‌టైన్ సినిమాలు చూస్తే మూడ్ సెట్ అవుతుంది. అన్నీ తరహా సినిమాలు చేస్తాను.
మీ తదుపరి సినిమాలు?
నేను నటించిన సినిమాలు ఓటీటీలో రావడం వల్ల అన్ని భాషల నుండి ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు, తెలుగులో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.


