‘కపుల్ ఫ్రెండ్లీ’ మూడు రోజుల కలెక్షన్స్.. వరల్డ్‌వైడ్‌గా ఎంత కలెక్ట్ చేసిందంటే..?

‘కపుల్ ఫ్రెండ్లీ’ మూడు రోజుల కలెక్షన్స్.. వరల్డ్‌వైడ్‌గా ఎంత కలెక్ట్ చేసిందంటే..?

Published on Feb 17, 2026 2:03 PM IST

Couple Friendly

వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’ (Couple Friendly)బాక్సాఫీస్ వద్ద మంచి రన్ కంటిన్యూ చేస్తోంది. సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ఈ చిత్రం తన సహజమైన కథనం మరియు చక్కటి నటనతో ప్రేక్షకులను ముఖ్యంగా యూత్‌ను ఆకట్టుకుంటోంది. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిన్న సినిమాకు అన్ని వర్గాల నుంచి పాజిటివ్ టాక్ లభిస్తుంది.

ఈ చిత్రం మొదటి మూడు రోజుల థియేట్రికల్ రన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక ఈ మూడు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.5.42 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. కేవలం వీకెండ్‌ కాకుండా, కీలకమైన సోమవారం కూడా మంచి ఆక్యుపెన్సీతో ‘మండే టెస్ట్’ను పాస్ అయింది.

యూవీ కాన్సెప్ట్స్ మరియు అజయ్ కుమార్ రాజు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో రాజీవ్ కనకాల, యోగి బాబు, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషించారు. తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదలైన ఈ చిత్రానికి ఆదిత్య రవీంద్రన్ సంగీతం అందించారు. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద స్టడీగా రన్ అవుతున్న ఈ చిత్రం రాబోయే రోజుల్లో మరిన్ని వసూళ్లు సాధించే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు