ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు అంటే..?

ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు అంటే..?

Published on Apr 11, 2026 1:00 PM IST

Ustaad Bhagat Singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాన్ని మిగిల్చింది. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో వచ్చిన రెండో సినిమా కావడంతో అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే, మిక్స్డ్ రెస్పాన్స్, నెగటివ్ రివ్యూల కారణంగా ఈ చిత్రం టోటల్ రన్‌లో రూ.100 కోట్ల మార్కును కూడా దాటలేకపోయింది.

​థియేటర్లలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన ఈ (Ustaad Bhagat Singh) చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్, ఈ సినిమాను ఏప్రిల్ 16 నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషల్లో ఏకకాలంలో పాన్-ఇండియా స్థాయిలో డిజిటల్ డెబ్యూ చేయనుంది.

​మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీలీల మరియు రాశీ ఖన్నా హీరోయిన్స్ గా నటించగా, పార్తీబన్ విలన్ పాత్రలో కనిపించారు. దేవి శ్రీ ప్రసాద్ పాటలు అందించగా, థమన్ బీజీఎం సమకూర్చాడు. కె.ఎస్. రవికుమార్, గౌతమి, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం, మరి ఓటీటీ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు