‘నిలవే’ సక్సెస్ మీట్.. ప్రేక్షకులకు హీరో సౌమిత్ కృతజ్ఞతలు

‘నిలవే’ సక్సెస్ మీట్.. ప్రేక్షకులకు హీరో సౌమిత్ కృతజ్ఞతలు

Published on Feb 17, 2026 8:00 AM IST

ప్రేమికుల దినోత్సవం కానుకగా విడుదలైన ‘నిలవే’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. సౌమిత్ పోలాడి, శ్రేయాసి సేన్ జంటగా నటించిన ఈ మ్యూజికల్ లవ్ డ్రామాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం మంగళవారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో సక్సెస్ మీట్ నిర్వహించింది.

​ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ దర్శకులు వి. సముద్ర మాట్లాడుతూ, వాలెంటైన్స్ డే రేసులో నిలిచిన చిత్రాల్లో ‘నిలవే’ విశేష ఆదరణను సొంతం చేసుకుందని ప్రశంసించారు. నటుడు జెమిని సురేష్ స్పందిస్తూ, ఈ సినిమా నేటి తరం ‘గీతాంజలి’లా ఆహ్లాదకరంగా ఉందన్నారు. హీరో సౌమిత్ మాట్లాడుతూ, మూడేళ్ల కష్టానికి దక్కిన ప్రతిఫలమిదని, తమ చిత్రాన్ని ప్రేక్షకులు గుండెలకు హత్తుకోవడం సంతోషంగా ఉందన్నారు.

​దర్శకుడు సాయి కే వెన్నం, నిర్మాత రాజ్ అల్లాడ మాట్లాడుతూ.. కొత్త వారితో చేసిన ఈ ప్రయత్నాన్ని ఆదరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆస్కార్ విజేత చంద్రబోస్ వీడియో సందేశం ద్వారా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. POV ఆర్ట్స్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రంలో హర్ష చెముడు కీలక పాత్రలో నటించగా, కళ్యాణ్ నాయక్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు