హే బలవంత్ : ఓటీటీ, శాటిలైట్ డీల్స్ ముగించుకున్న సుహాస్ మూవీ..!

హే బలవంత్ : ఓటీటీ, శాటిలైట్ డీల్స్ ముగించుకున్న సుహాస్ మూవీ..!

Published on Feb 18, 2026 12:11 AM IST

Hey Balavanth

ట్యాలెంటెడ్ యాక్టర్ సుహాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హే బలవంత్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని ఫిబ్రవరి 20న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. గోపి అచ్చర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ, శాటిలైట్ డీల్స్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది.

ఈ చిత్ర ఓటీటీ రైట్స్‌ను జీ5, శాటిలైట్ రైట్స్‌ను జీ తెలుగు మంచి ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నాయి. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్‌ను మరింత వేగవంతం చేస్తున్నారు మేకర్స్. ఇక ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేష్ మరో ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. కాగా శివాని నగరం హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందించారు.

ఈ సినిమాలో అన్నపూర్ణ, హర్ష వర్ధన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను త్రిశూల్ విజనరీ స్టూడియోస్ సెకండ్ బ్యానర్‌పై బి.నరేంద్ర రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు