కన్నడలో ‘ఓ సుందర రాక్షసి’ చిత్రానికి మంచి స్పందన

కన్నడలో ‘ఓ సుందర రాక్షసి’ చిత్రానికి మంచి స్పందన

Published on Feb 18, 2026 6:00 AM IST

O-Andala-Rakshasi

షెరాజ్ మెహదీ హీరోగా, దర్శకుడిగా రూపొందించిన చిత్రం ‘ఓ అందాల రాక్షసి’. ఇటీవల తెలుగులో విడుదలైన ఈ సినిమా, ఇప్పుడు కన్నడలో ‘ఓ సుందర రాక్షసి’ పేరుతో విడుదలై మంచి స్పందన దక్కించుకుంటోంది. బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు ఉన్న షెరాజ్.. గతంలో ‘కెఎస్ 100’, ‘ఆమ్లెట్’, ‘ఇంకా ఏమీ అనుకోలేదు’, ‘పార్సిల్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు.

మహిళలపై జరుగుతున్న వేధింపులు, అత్యాచారాలకు పాల్పడే వారికి ఎలాంటి శిక్షలు పడాలి? అసలు మహిళల జోలికి వస్తే భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాలు ఏంటి? అనే సామాజిక అంశాల నేపథ్యంతో ఈ కథను షెరాజ్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో దర్శకుడిగా, హీరోగా ఆయన నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి.

ఈ సినిమాలో విహాన్షి హెగ్డే, కృతి వర్మ హీరోయిన్లుగా నటించారు. ‘స్కై ఈజ్ ది లిమిట్’ బ్యానర్‌పై సురీందర్ కౌర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సామాజిక సందేశంతో వచ్చిన ఈ చిత్రం కన్నడ ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంటోందని చిత్రబృందం తెలిపింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు