ఇప్పుడు ప్రపంచ సినిమా అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ భారతీయ సినిమా ఏదన్నా ఉంది అంటే అది డెఫినెట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి కలయికలో చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ “వారణాసి” (Varanasi) అనే చెప్పాలి. ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రంలో ఇండియన్ సినిమా నుంచి కెరీర్ స్టార్ట్ చేసి హాలీవుడ్ లో సెటిల్ అయ్యిన స్టార్ నటి ప్రియాంక చోప్రా జోనస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఆమె ఈ చిత్రంపై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
Priyanka comments on Varanasi – వారణాసి నా కెరీర్ ని మలుపు తిప్పుతుంది..
ప్రియాంక చోప్రా (Priyanka Chopra) నటించిన లేటెస్ట్ హాలీవుడ్ చిత్రం ‘ది బ్లఫ్’ అనే సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి రాబోతుంది. అయితే ఈ ఒరిజినల్ చిత్రం స్పెషల్ ప్రీమియర్స్ లో ఆమె ఈ కామెంట్స్ చేయడం చేయడం జరిగింది.
ఫిబ్రవరి 27 నుంచి ప్రియాంక, ది బాయ్స్ నటుడు సినిమా స్ట్రీమింగ్
పాపులర్ ఏ రేటెడ్ సిరీస్ ది బాయ్స్ నటుడు కార్ల్ అర్బన్ అలాగే ప్రియాంకా చోప్రా నటించిన ‘ది బ్లఫ్’ అనే యాక్షన్ చిత్రం పాన్ వరల్డ్ భాషల్లో ఈ ఫిబ్రవరి 27 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఫ్రాంక్ ఈ ఫ్లవర్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులో కూడా స్ట్రీమింగ్ కి రానుంది.


