‘మిరాకిల్’ మూడో షెడ్యూల్ షురూ.. సెట్స్‌లో అడుగుపెట్టనున్న హెబ్బా పటేల్

‘మిరాకిల్’ మూడో షెడ్యూల్ షురూ.. సెట్స్‌లో అడుగుపెట్టనున్న హెబ్బా పటేల్

Published on Feb 19, 2026 8:00 AM IST

Miracle

సైదా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రూపొందుతున్న ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మిరాకిల్’. రణధీర్ భీసు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటి హెబ్బా పటేల్ హీరోయిన్‌గా అలరించనున్నారు. ప్రభాస్ నిమ్మల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మూడో షెడ్యూల్ షూటింగ్ ఫిబ్రవరి 24 నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రారంభం కానుంది. ఈ తాజా షెడ్యూల్‌లోనే హెబ్బా పటేల్ సెట్స్‌లో అడుగుపెట్టనున్నారు.

ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో సీనియర్ హీరోలు శ్రీరామ్, సురేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నాయుడు పెండ్ర విలన్‌గా పరిచయమవుతుండగా, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీ ఫోరెన్సిక్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు.

రమేష్ ఎగ్గిడి, శ్రీకాంత్ మొగదాసు, చందర్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో యాక్షన్ బ్లాక్స్, హెబ్బా పటేల్ గ్లామర్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని నిర్మాతలు తెలిపారు. ‘సత్య గ్యాంగ్’, ‘ఫైటర్ శివ’ తర్వాత దర్శకుడు ప్రభాస్ నిమ్మల ఈ చిత్రంతో ప్రేక్షకులకు నిజమైన ‘మిరాకిల్’ చూపించనున్నారని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వ బాధ్యతలను ప్రభాస్ నిమ్మల స్వయంగా నిర్వహిస్తుండటం విశేషం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు