‘కపుల్ ఫ్రెండ్లి’ కోసం డార్లింగ్.. అది పర్శనల్ అంటున్న ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్

‘కపుల్ ఫ్రెండ్లి’ కోసం డార్లింగ్.. అది పర్శనల్ అంటున్న ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్

Published on Feb 20, 2026 2:00 AM IST

Couple Friendly

లేటెస్ట్ గా మన టాలీవుడ్ నుంచి రిలీజ్ కి వచ్చిన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చిత్రమే ‘కపుల్ ఫ్రెండ్లి’. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో హీరోయిన్స్ సంతోష్ శోభన్ హీరోగా మానస వారణాసి హీరోయిన్ గా దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ తెరకెక్కించిన ఈ సినిమా ఆడియెన్స్ నుంచి మంచి ఫీడ్ బ్యాక్ ని సొంతం చేసుకొని డీసెంట్ వసూళ్లు రాబట్టింది.

అయితే ఈ సినిమా సక్సెస్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా యాడ్ అవ్వడం జరిగింది. మేకర్స్ ఆల్రెడీ ప్రభాస్ సర్ప్రైజ్ పై మంచి హింట్ కూడా ఇచ్చారు. ఇలా ఫైనల్ గా ఒక ఫన్ మూమెంట్స్ తో కూడిన స్పెషల్ ఇంటర్వ్యూని ప్లాన్ చేయగా ఈ ఇంటర్వ్యూ తాలూకా ప్రోమో బయటకి వచ్చింది. ప్రభాస్ ఇందులో మంచి చార్మింగ్ లుక్స్ లో కనిపిస్తుండగా టీం అంతటితో కలిసి ఆహ్లాదంగా మాట్లాడుకున్నారు.

పైగా ఇందులో ప్రభాస్ పై హీరోయిన్ మీకు లవ్ అంటే ఏంటి అనే ప్రశ్నకి పర్శనల్ క్వశ్చన్ అంటూ డార్లింగ్ బదులివ్వడం ఇలా ఎంతో సరదాగా ఈ ఇంటర్వ్యూ జరిగినట్టు కనిపిస్తుంది. ఇక ఈ ఫుల్ ఇంటర్వ్యూ అయితే రేపు యూవీ క్రియేషన్స్ వారు రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు