అఫీషియల్: శ్రీవిష్ణు వర్సెస్ శ్రీవిష్ణు.. థ్రిల్లర్ సినిమా వాయిదా, కొత్త డేట్ ఇదే

అఫీషియల్: శ్రీవిష్ణు వర్సెస్ శ్రీవిష్ణు.. థ్రిల్లర్ సినిమా వాయిదా, కొత్త డేట్ ఇదే

Published on Feb 20, 2026 11:00 PM IST

Mrithyunjay

టాలీవుడ్ స్టార్ ఎంటర్టైనర్ శ్రీవిష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రాలు రెండు విష్ణు విన్యాసం అలాగే మృత్యుంజయ్ రెండూ ఒకే సమయంలో ఒక్క రోజు గ్యాప్ లో రావడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ దగ్గర ఒకే హీరో సినిమాలు రెండూ ఒకే సమయంలో రావడం అనేది చాలా అరుదు. ఇది శ్రీవిష్ణు వరకు వచ్చింది కానీ ఇది సాధ్యం అవుతుందా లేదా అనేది మాత్రం ఇప్పుడు తేలిపోయింది.

ఈ రెండు చిత్రాల్లో థ్రిల్లర్ సినిమా మృత్యుంజయ్ వాయిదా పడినట్టుగా ఇప్పుడు శ్రీవిష్ణు రివీల్ చేసాడు. శ్రీవిష్ణు హీరోగా నటించిన విష్ణు విన్యాసం ఒకటే ఈ ఫిబ్రవరి ఎండింగ్ లో వస్తుంది అని కన్ఫర్మ్ చేశారు. ఇక మృత్యుంజయ్ సినిమా మార్చ్ 6న థియేటర్స్ లో విడుదల కానున్నట్టు కన్ఫర్మ్ చేశారు. సో ఒక్కరోజు క్లాష్ కాస్తా వారానికి షిఫ్ట్ అయ్యింది. మరి ఈ రిలీజ్ లలో ఏ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు