న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ చిత్రం ‘ది ప్యారడైజ్’ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా విడుదలను మేకర్స్ ఆగస్టు 21, 2026కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా, అభిమానులను ఉర్రూతలూగించేందుకు చిత్ర యూనిట్ ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్’ సాంగ్ ప్రోమోను విడుదల చేసింది.
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన ఈ సాంగ్ ప్రోమో పవర్ ప్యాక్డ్‌గా ఉంది. టీజర్‌లో వచ్చిన క్యాచీ బీట్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా, ఇప్పుడు ప్రోమోలో ఆ ఎనర్జీని నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లారు. ఇక ఈ పాటను ఫిబ్రవరి 24న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నాని తన సరికొత్త మేకోవర్ మరియు ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్‌తో మాస్ ఆడియన్స్‌ను థ్రిల్ చేయడం ఖాయమనిపిస్తోంది.
పాన్-ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా మోహన్ బాబు, సోనాలి కుల్కర్ణి, బాబు మోహన్, తనికెళ్ల భరణి మరియు సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. SLV సినిమాస్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను సృష్టిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


