‘ధురంధర్ 2’లో ఓజీ విలన్.. థియేటర్లు బ్లాస్ట్ అవ్వడం ఖాయం..!

‘ధురంధర్ 2’లో ఓజీ విలన్.. థియేటర్లు బ్లాస్ట్ అవ్వడం ఖాయం..!

Published on Feb 23, 2026 3:00 PM IST

Dhurandhar 2 1

బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ హిట్ ‘ధురంధర్’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘ధురంధర్ : ది రివెంజ్’ పై ప్రస్తుతం భారీ అంచనాలు నెలకొన్నాయి. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన మరింత పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించనున్నాడు. ఈ సీక్వెల్‌లో కథ ఎలాంటి మలుపులు తిరుగుతుంది, రణవీర్ పాత్ర ఎలా ఉండబోతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో రోజురోజుకూ పెరుగుతోంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ వెబ్‌సైట్ ‘లెటర్‌బాక్స్డ్’లో ఈ చిత్ర నటీనటుల జాబితాలో ఇమ్రాన్ హష్మీ పేరు కొద్దిసేపు కనిపించింది. ఆ తర్వాత వెంటనే ఆ పేరును తొలగించినప్పటికీ, అప్పటికే ఈ వార్త నెట్టింట హల్‌చల్ చేసింది. ఇందులో ఇమ్రాన్ హష్మీ ‘బడా సాహెబ్’ అనే కీలక పాత్రలో కనిపిస్తాడని గట్టిగా ప్రచారం జరుగుతోంది. మార్చి 19న విడుదల కానున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ పాత్ర నిజంగానే ఉందో లేదో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.

దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను జియో స్టూడియోస్ మరియు B62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈసారి ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు పలు భాషల్లో పాన్-ఇండియా లెవల్‌లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న క్రేజ్‌ను మరింత పెంచేలా సినిమా నుండి ఒక సింగిల్‌ను విడుదల చేయాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. త్వరలోనే చిత్ర యూనిట్ నుండి మరిన్ని కీలక అప్‌డేట్స్ వచ్చే అవకాశం ఉంది.
d

సంబంధిత సమాచారం

తాజా వార్తలు