ఉగాదికి చిరంజీవి ‘విశ్వంభర’ విడుదల తేదీ !

ఉగాదికి చిరంజీవి ‘విశ్వంభర’ విడుదల తేదీ !

Published on Feb 24, 2026 2:00 AM IST

Vishwambhara

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు వశిష్ట కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం “విశ్వంభర”(Vishwambhara). ఈ సినిమా చాలా కాలంగా నిర్మాణంలో ఉంది. తాజా సమాచారం ప్రకారం, తెలుగు నూతన సంవత్సరం ఉగాదికి ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారని తెలుస్తోంది. ప్రత్యేక గ్లింప్స్ ద్వారా విడుదల తేదీని వెల్లడించాలని మేకర్స్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా మొదటి టీజర్‌కు నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి.

అందుకే, ఈ సినిమా పై మేకర్స్ మరింతగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పటిష్టమైన విఎఫ్ఎక్స్ ఉండేలా చూసుకుంటున్నారు. కాగా ఈ సినిమాలో త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తోంది. అన్నట్టు ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాలోని వినోదం, ‘హిట్లర్’ లోని సెంటిమెంట్ ఈ సోషియో ఫాంటసీ సినిమాలో కనిపిస్తాయని తెలుస్తోంది. కాగా సృష్టి, స్థితి, లయ ఈ మూడింటి నేపథ్యంలో ఈ కథ సాగుతుందట. ఈ భారీ చిత్రానికి ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఆషిక రంగనాథ్, రమ్య పసుపులేటి, ఇషా చావ్లా మరియు అశ్రిత వేముగంటి నండూరి కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

తాజా వార్తలు