మరో ఓటిటిలోకి కూడా నవీన్ చంద్ర హారర్ థ్రిల్లర్!

మరో ఓటిటిలోకి కూడా నవీన్ చంద్ర హారర్ థ్రిల్లర్!

Published on Feb 24, 2026 11:30 PM IST

Honey Movie Review

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోస్ లో నవీన్ చంద్ర కూడా ఒకరు. రీసెంట్ గా పలు ఇంట్రెస్టింగ్ సబ్జెక్టులు చేస్తూ వచ్చిన నవీన్ చంద్ర నుంచి వచ్చిన తాజా సినిమానే “హనీ”. దర్శకుడు కరుణ కుమార్ తో ప్లాన్ చేసిన ఈ థ్రిల్లర్ చిత్రం అనుకున్న రేంజ్ లో ఆడియెన్స్ ని ఆకట్టుకోలేదు.

ఇక థియేటర్స్ నుంచి నెక్స్ట్ ఓటిటి రిలీజ్ కి ఈ సినిమా ఫిక్స్ అయ్యింది. ఈ సినిమాని మొదట సన్ నెక్స్ట్ వారు సొంతం చేసుకోగా వారు ఇందులో ఈ ఫిబ్రవరి 27 నుంచి సినిమా అందుబాటులో ఉంటుంది అని కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ సినిమా దీనితో పాటుగా మరో ఓటిటిలో కూడా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది.

ఈ చిత్రాన్ని మరో పాపులర్ ఓటిటి అమెజాన్ ప్రైమ్ వీడియో వారు కూడా సొంతం చేసుకున్నారు. వారు ఈ సినిమాని అదే ఫిబ్రవరి 27 నుంచే తెస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. సో ఈ రెండు ఓటిటిలలో ఒకే రోజు ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. ఇక ఈ సినిమాలో మంగళవారం నటి దివ్య పిళ్ళై కీలక పాత్ర పోషించగా కొన్ని యదార్ధ ఘటనలు ఆధారంగా మేకర్స్ ఈ సినిమాని తెరకెక్కించారు.

తాజా వార్తలు