అఫీషియల్ గా భార్య భర్తలైన విజయ్, రష్మిక.. సరిగ్గా ఇన్ని నిమిషాలకి!

అఫీషియల్ గా భార్య భర్తలైన విజయ్, రష్మిక.. సరిగ్గా ఇన్ని నిమిషాలకి!

Published on Feb 26, 2026 10:30 AM IST

VIROSH

ప్రస్తుతం మన టాలీవుడ్ యువ జంట సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ అలాగే నేషనల్ క్రష్ రష్మిక మందన్నాలు వివాహం చేసుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. దేశ వ్యాప్తంగా అనేకమంది సినీ ప్రముఖులు ఈ జంట పెళ్ళికి వస్తున్నారు. అయితే వీరికి నిన్న దేశ ప్రధాని మోడీ నుంచి కూడా శుభాకాంక్షలు వచ్చాయి.

ఇక ఇదిలా ఉండగా నేడు ఫిబ్రవరి 26న ఈ యువ జంట అధికారికంగా వివాహం చేసుకొని ఒకటైనట్టు తెలుస్తుంది. ఈ 26 ఉదయం సరిగ్గా 10 గంటల 10 నిమిషాలకి విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలు తాళి బంధంతో ఒకటైనట్టు బయటకి వచ్చింది. దీనితో గత ఎనిమిదేళ్ల తమ రిలేషన్ షిప్ కి ముగింపు పలికి కొత్త జీవితానికి నాంది పలికారు. ఇక ఈ శుభవార్తతో అభిమానులు, ప్రముఖులు విరోష్ లకి తమ శుభాభినందనలు తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు