పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన హన్సి ప్రొడక్షన్స్ మొదటి సినిమా

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన హన్సి ప్రొడక్షన్స్ మొదటి సినిమా

Published on Feb 28, 2026 6:00 AM IST

Untitled 1 1

హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నూతన చిత్రం శనివారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. యూత్‌ఫుల్ లవ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా శ్రీ హన్సిక పెద్దిరెడ్డి నిర్మాతగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. రఘువర్ధన్ కోట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు తవిటిరాజు తలచింతల కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రంలో జగన్ యోగి రాజు, నవ్య చిట్యాల హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్ నటుడు దేవీ ప్రసాద్‌తో పాటు లక్ష్మణ్ మీసాల, పవన్ రమేష్, సునందిని, అంజు వాల్గుమన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రారంభోత్సవ ముహూర్తపు షాట్‌కు శ్రీధర్ పెద్దిరెడ్డి క్లాప్ కొట్టగా, స్రవంతి పెద్దిరెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనంతరం నిర్మాత శ్రీ హన్సిక పెద్దిరెడ్డి దర్శకుడికి స్క్రిప్ట్ అందజేశారు.

సినిమా రంగంపై ఉన్న మక్కువ, బాధ్యతతో నిర్మాణంలోకి అడుగుపెడుతున్నట్లు ఈ సందర్భంగా నిర్మాత శ్రీ హన్సిక తెలిపారు. ఉన్నతమైన నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో ఈ ఎంటర్‌టైన్‌మెంట్ లవ్ డ్రామాను నిర్మిస్తున్నామని, యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులందరినీ ఈ చిత్రం అలరిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడిస్తామని దర్శకుడు రఘువర్ధన్ కోట్ల పేర్కొన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు