యష్, కియారా రొమాంటిక్ సాంగ్ కి టైం ఫిక్స్!

యష్, కియారా రొమాంటిక్ సాంగ్ కి టైం ఫిక్స్!

Published on Mar 1, 2026 12:00 AM IST

toxic

ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో మంచి బజ్ ని సెట్ చేసుకున్న భారీ చిత్రాల్లో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా అనేకమంది హీరోయిన్స్ కలయికలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ చిత్రం “టాక్సిక్” కూడా ఒకటి. టీజర్, గ్లింప్స్ లతో మంచి రెస్పాన్స్ ని అందుకోగా ఇక ఈ సినిమా నుంచి అభిమానులు ఎదురు చూస్తున్న ఫస్ట్ సింగిల్ పై మరింత క్లారిటీ వచ్చింది.

రీసెంట్ గా ఒక హాట్ పోస్టర్ తో లీడ్ జంట యష్, కియారా అద్వానీ ల పోస్టర్ తో సోషల్ మీడియాలో క్రేజీ రెస్పాన్స్ అందుకుంది. అయితే ఈ రొమాంటిక్ నెంబర్ పై మరో అప్డేట్ అందించారు. దీనితో ఈ సాంగ్ ని మార్చ్ 2న మధ్యాహ్నం 12 గంటల 59 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టు హీరో హీరోయిన్స్ పై మరో బ్యూటిఫుల్ పోస్టర్ ని రిలీజ్ చేసి కన్ఫర్మ్ చేశారు. సో ఫ్యాన్స్ అప్పుడు వరకు ఆగాల్సిందే. అలాగే ఈ సాంగ్ ని రవి బసృర్ ఎలా కంపోజ్ చేసారో కూడా చూడాలి. ఇక ఈ సినిమాకి కే వి ఎన్ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే ఈ మార్చ్ 19న సినిమా భారీ ఎత్తున విడుదల కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు