విజయ్, రష్మిక పెళ్లి.. దేశవ్యాప్తంగా తమ పెళ్లికి జంట ఇచ్చిన బ్యూటిఫుల్ గిఫ్ట్ ఏంటో తెలుసా!

విజయ్, రష్మిక పెళ్లి.. దేశవ్యాప్తంగా తమ పెళ్లికి జంట ఇచ్చిన బ్యూటిఫుల్ గిఫ్ట్ ఏంటో తెలుసా!

Published on Feb 28, 2026 11:14 PM IST

Vijay-Deverakonda-and-Rashm

మన టాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్స్ విజయ్ దేవరకొండ అలాగే రష్మిక మందన్నా రీసెంట్ గానే పెళ్లి చేసుకొని ఒకటైన సంగతి తెలిసిందే. అయితే వీరి పెళ్ళికి గాను దేశ వ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సినీ ఇంకా రాజకీయ ప్రముఖులు ఏకంగా మోడీ, అమిత్ షా లు కూడా వీరికి తమ బెస్ట్ విషెస్ అందించారు.

ఇలా ఒక పండుగలా వీరి పెళ్లి ఎంతో ఘనంగా జరుపుకున్నారు. పైగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా నార్త్, సౌత్ ఇలా అన్ని చోట్లా ఈ జంట కోసమే మాట్లాడుకున్నారు. మరి ఇంత ప్రేమ చూపించిన యావత్తు భారతదేశ ప్రజలకి వీరి సైడ్ నుంచి ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ ని పంపుతున్నట్టు తెలిపారు.

దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా కొన్ని ముఖ్య ప్రాంతాలు ఎంచుకొని అక్కడ తమ నుంచి గిఫ్ట్ గా మిఠాయిలు, పలు దేవాలయాల్లో భోజనాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇది మాత్రం ఒక ఊహించని బ్యూటిఫుల్ డెసిషన్ అని చెప్పాలి. ఈ మార్చ్ 1నే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టు రష్మిక తమ ఇద్దరి తరపున బహుమానంగా పోస్ట్ చేసింది. దీనితో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు