టాలీవుడ్ నుంచి అతి తక్కువ సినిమాలతోనే పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషనల్ దర్శకునిగా మారిన అతి కొద్ది మందిలో సందీప్ రెడ్డి వంగ కూడా ఒకరు. అయితే సందీప్ రెడ్డి వంగ తన సినిమాలతో కొందరు నటులకి మాత్రం ఊహించని ఫేమ్ ని అందించి పెట్టారు అని చెప్పొచ్చు. లైమ్ లైట్ లో లేనివారిని కూడా తీసుకొచ్చి పాన్ ఇండియా లెవెల్లో ఇప్పుడు సెటిల్ అయ్యిన ఆర్టిస్ట్ లుగా తాను మార్చారు.
ఇక కొందరు బ్యూటీస్ కి కూడా తన సినిమాలతో మంచి ఫేమ్ వచ్చింది. గతంలో చేసిన అనిమల్ అనే ఒక్క సినిమాతో త్రిప్తి డిమ్రి ఫేట్ ఒక్క నైట్ లో మారిపోయింది. ఆ సినిమా విడుదల అయ్యాక సోషల్ మీడియాలో ఆమె ఫాలోవర్స్ లిస్ట్ భారీ జంప్ అందుకుంది. ఇక లేటెస్ట్ గా మళ్ళీ స్పిరిట్ లో నుంచి నిన్న వచ్చిన పోస్టర్ లో కనిపించిన ఐశ్వర్య దేశాయ్ అనే నటికి కూడా అదే జరిగింది.
ఈ పోస్టర్ వచ్చిన తర్వాత ఆమె సోషల్ మీడియా ఫాలోవర్స్ బాగా పెరిగారట. దీనితో మరోసారి సందీప్ ఛాయిస్ మరో నటికి మంచి లైఫ్ ఇచ్చినట్టే అని చెప్పాలి. ఇక సినిమా వచ్చే లోపు సినిమా వచ్చిన తర్వాత ఆమెకి ఎలాంటి రీచ్ ఉంటుందో చూడాలి.


