మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘పెద్ది’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే వచ్చిన గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ సాంగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ సాంగ్‌గా ‘రై రై రా రా’ అనే పాటను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.
ఇప్పటికే ఈ పాటను నేడు(మార్చి 2న) రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. దీంతో అభిమానులు ఈ పాట ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, తాజాగా ఈ పాటను రిలీజ్ చేసే టైమ్ కూడా ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ పాటను నేడు సాయంత్రం 7.02 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించి ఓ కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో రామ్ చరణ్ మరోసారి తన గ్రేస్, స్టెప్పులతో ప్రేక్షకులను ఉర్రూతలూగించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ మరియు వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న వరల్డ్‌వైడ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.


