Ustaad Bhagat Singh: ఈ ట్రైలర్ ముందే వదిలి ఉంటే బొమ్మ బ్లాక్‌బస్టర్.. నెట్‌ఫ్లిక్స్ కట్‌పై ఫ్యాన్స్ రచ్చ!

Ustaad Bhagat Singh: ఈ ట్రైలర్ ముందే వదిలి ఉంటే బొమ్మ బ్లాక్‌బస్టర్.. నెట్‌ఫ్లిక్స్ కట్‌పై ఫ్యాన్స్ రచ్చ!

Published on Apr 16, 2026 6:03 PM IST

ubs

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీలోకి వచ్చేసింది. ఏప్రిల్ 16 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ మొదలైంది. అయితే, ఓటీటీ రిలీజ్ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ వదిలిన కొత్త ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. థియేటర్లలోకి సినిమాను తీసుకొచ్చినప్పుడు రిలీజ్ చేసిన ట్రైలర్ కంటే.. ఈ నెట్‌ఫ్లిక్స్ కట్ ఎంతో పవర్‌ఫుల్‌గా ఉందని అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇదే సమయంలో డైరెక్టర్ హరీష్ శంకర్‌పై గట్టిగానే ఫైర్ అవుతున్నారు.

నెట్‌ఫ్లిక్స్ ట్రైలర్ కట్ చూసిన పవన్ ఫ్యాన్స్ తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. “అసలు ఈ ట్రైలర్‌ను థియేట్రికల్ రిలీజ్‌కు ముందు వదిలి ఉంటే సినిమా రేంజ్ వేరేలా ఉండేది” అని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. కేవలం ఈ ఒక్క ఎడిట్ కట్ వల్లే ఫస్ట్ డే కలెక్షన్స్ మరో 10 నుంచి 15 కోట్ల రూపాయలు అదనంగా వచ్చేవంటూ చర్చిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ టీమ్ ఎడిటింగ్ స్కిల్స్‌ను మెచ్చుకుంటూనే.. మైత్రీ మూవీ మేకర్స్, డైరెక్టర్ హరీష్ శంకర్ ఇలాంటి ట్రైలర్ ఇవ్వడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారని తప్పుబడుతున్నారు.

హరీష్ శంకర్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ నుంచి తాము ఇంకా బెటర్ ఔట్‌పుట్ ఆశిస్తున్నామని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. థియేట్రికల్ ట్రైలర్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్లే అప్పట్లో సినిమాపై కొంత హైప్ తగ్గిందని వారు అభిప్రాయపడుతున్నారు. కల్ట్ డైరెక్టర్‌గా పేరున్న ఆయన.. సోషల్ మీడియా చర్చల కంటే కంటెంట్ మీద మరింత ఫోకస్ పెడితే బాగుంటుందని సూచిస్తున్నారు. అలాగే, ట్రెండ్‌కు తగ్గట్లుగా కొత్త ఆలోచనలతో, సాలిడ్ కంటెంట్‌తో ఆయన తర్వాతి సినిమా ఉండాలని ఫ్యాన్స్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.

ఏదేమైనా, నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేసిన ఈ కొత్త ఎడిట్ సినిమాపై మళ్లీ ఆసక్తిని పెంచింది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నెట్‌ఫ్లిక్స్ అందుబాటులోకి తెచ్చింది. ఓవరాల్‌గా ఈ కొత్త ట్రైలర్ చూసిన తర్వాత, అప్పట్లో థియేటర్లలో సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు కూడా ఇప్పుడు ఇంట్లో కూర్చుని ఈ మాస్ యాక్షన్‌ను ఎంజాయ్ చేసేందుకు రెడీ అయిపోయారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు