విజయ్, సంగీత విడాకులు.. 250 కోట్లతో ముడి?

విజయ్, సంగీత విడాకులు.. 250 కోట్లతో ముడి?

Published on Mar 4, 2026 12:36 PM IST

Thalapathy Vijay Divorce

ఇళయ దళపతి విజయ్ ఇప్పుడు తన సినిమా కెరీర్ ని ముగించుకున్న సంగతి తెలిసిందే. తన ఆఖరి చిత్రం జన నాయకుడు రిలీజ్ కి ఇంకా నోచుకోలేదు కానీ ఈ గ్యాప్ లో మాత్రం విజయ్ కి ఊహించని సమస్యలు కూడా వచ్చాయి. అలా తన భార్య సంగీత విజయ్ తో విడాకులు కావాలని కోరుతూ కోర్టు మెట్లు ఎక్కడం షాకింగ్ గా మారింది. అయితే ఈ సమస్యపై మరో షాకింగ్ రూమర్ ఇప్పుడు సినీ వర్గాల్లో వైరల్ గా మారింది.

తమ సమస్యని విజయ్ పబ్లిక్ గా పెట్టకుండా సామరస్యంగా ముగించాలని చూస్తున్నట్టుగా పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విజయ్ అందుకు గాను తన భార్య, పిల్లలు జేసన్ సంజయ్, సాషాల భవిష్యత్తు ఆర్ధిక నిలకడ కోసం భారీ మొత్తంలో 250 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది.

ఇలా తమ సమస్యని సెటిల్ చేసుకోవాలని విజయ్ భావిస్తున్నట్టు కొన్ని కొత్త రూమర్స్ ఇప్పుడు మొదలయ్యాయి. మరి దీనిపై అధికారిక క్లారిటీ బయటకి రావాల్సి ఉంది. ఇక విజయ్ మరోపక్క తన రాజకీయాల్లో బిజీగా సాగుతూ ఈ ఏడాది తమిళనాట జరగనున్న ఎన్నికలపై దృష్టి సారించారు. కానీ తన ఆఖరి సినిమా మాత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది ఇప్పటికీ మిస్టరీ గానే ఉండిపోయింది.

తాజా వార్తలు