టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వెడ్డింగ్ రిసెప్షన్ హైదరాబాద్‌లో చాలా గ్రాండ్‌గా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది ప్రముఖులు హాజరై కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్, తన కూతురు సితార ఘట్టమనేనితో కలిసి ఈ రిసెప్షన్‌కు విచ్చేశారు.
ఈ గ్రాండ్ ఈవెంట్లో సితార ‘స్పెషల్ అట్రాక్షన్’గా నిలిచింది. బ్యూటిఫుల్ పింక్ కలర్ లెహంగాలో, సింపుల్ మేకప్ మరియు కర్లీ హెయిర్‌తో సితార చాలా క్యూట్‌గా, చూడముచ్చటగా కనిపించింది. ఆమె ఎంట్రీ ఇవ్వగానే అక్కడ ఉన్న కెమెరాలన్నీ ఆమె వైపే తిరిగాయి. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఫాలోయింగ్ పెంచుకుంటున్న సితార, ఈ ఈవెంట్లో తన క్యూట్ స్మైల్‌తో అందరి మనసు దోచుకుంది.
తాజాగా బయటకు వచ్చిన ఫోటోలలో నమ్రత, సితార.. విజయ్ మరియు రష్మికలతో కలిసి ఎంతో సరదాగా ముచ్చటిస్తున్న దృశ్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కొత్త జంటను విష్ చేస్తున్న సమయంలో వాళ్లందరి ముఖాల్లో ఉన్న ఆనందం ఈ క్యాండిడ్ పిక్చర్స్‌లో స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఫోటోలలో ఆనంద్ దేవరకొండతో పాటు విజయ్ వాళ్ల అమ్మగారు కూడా ఉన్నారు. ఇంత చిన్న వయసులోనే సితార ఒక స్టార్ సెలబ్రిటీలా ఫంక్షన్లలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారుతుండటం చూసి మహేష్ ఫ్యాన్స్ నెట్టింట కామెంట్స్ చేస్తూ తెగ సంబరపడిపోతున్నారు.


