వాయిదాల పరంపర.. రిలీజ్ డేట్ మార్చుకున్న మరో తెలుగు సినిమా ‘బ్యాండ్ మేళం’

వాయిదాల పరంపర.. రిలీజ్ డేట్ మార్చుకున్న మరో తెలుగు సినిమా ‘బ్యాండ్ మేళం’

Published on Mar 5, 2026 5:03 PM IST

Band-Melam-1

కన్నడ స్టార్ యష్ నటించిన ‘టాక్సిక్’ సినిమా వాయిదా పడటంతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పలు చిత్రాల తమ రిలీజ్ డేట్స్‌ను మార్చుకుంటున్నాయి. టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ ఫిలిం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఖాళీ అయిన ఆ స్లాట్‌ను దక్కించుకుంది. దీని ప్రభావంతో మరో తెలుగు చిత్రం తన రిలీజ్ ప్లాన్ మార్చుకోవాల్సి వచ్చింది.

‘కోర్ట్’ మూవీ ఫేం యంగ్ జోడీ హర్ష్ రోషన్, శ్రీదేవి అపల్లా జంటగా నటిస్తున్న చిత్రం ‘బ్యాండ్ మేళం’. గతంలో ఈ సినిమా వాయిదా పడుతుందనే ప్రచారం జరిగినప్పటికీ, మేకర్స్ మార్చి 13, 2026న వస్తున్నట్లు స్పష్టం చేశారు. అయితే, పవన్ కళ్యాణ్ సినిమా ముందుగా వస్తుండటంతో, పోటీని నివారించేందుకు చిత్ర యూనిట్ తమ నిర్ణయాన్ని మార్చుకుంది. ఇప్పుడు ఈ సినిమాను మార్చి 26, 2026న విడుదల చేయాలని నిర్ణయించారు. కొత్త విడుదల తేదీని తెలుపుతూ అధికారికంగా ఒక పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.

సతీష్ జవ్వాజి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు సాయి కుమార్ హీరోయిన్ తండ్రి పాత్రలో కనిపిస్తున్నారు. కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై కావ్య మరియు శ్రావ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

Band Melam

తాజా వార్తలు