సమీక్ష: ఎస్ సరస్వతి – పూర్తి స్థాయిలో ఆకట్టుకోని ఎమోషనల్ డ్రామా

సమీక్ష: ఎస్ సరస్వతి – పూర్తి స్థాయిలో ఆకట్టుకోని ఎమోషనల్ డ్రామా

Published on Mar 6, 2026 1:04 PM IST

S.Saraswathi

విడుదల తేదీ : మార్చి 06, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : వరలక్ష్మి శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, కిషోర్, రావు రమేష్, మురళీ శర్మ, రాధికా శరత్ కుమార్
దర్శకుడు : వరలక్ష్మి శరత్ కుమార్
నిర్మాతలు : పూజా శరత్ కుమార్ & వరలక్ష్మి శరత్ కుమార్
సంగీత దర్శకుడు : థమన్ ఎస్
ఛాయాగ్రహణం : ఏ.ఎం. ఎడ్విన్ సాకే
కూర్పు : వెంకట్ రాజన్

సంబంధిత లింక్స్ :ట్రైలర్ 

వెర్సటైల్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ మొట్ట మొదటిసారిగా దర్శకత్వం వహించిన లేటెస్ట్ చిత్రమే ఎస్ సరస్వతి. ఆమె కూడా ఈ సినిమాలో మెయిన్ లీడ్ గా నటించగా ఈ చిత్రంతో ఆమె ఎంతమేరకు మెప్పించారో చూద్దాం రండి.

కథ:

ఒక నర్స్ గా పని చేసే లక్ష్మి (వరలక్ష్మి శరత్ కుమార్) ఆమె తన కూతురు సరస్వతి (బేబీ నివిక్ష) తో ఒక సింపుల్, హ్యాపీ జీవితాన్ని లీడ్ చేస్తుంది. అయితే ఓ రోజు లక్ష్మి తన కూతుర్ని స్కూల్ దగ్గర విడిచిపెట్టి మళ్ళీ సాయంత్రం పిక్ చేసుకోడానికి వెళుతుంది. కానీ అసలు ఆమె ఎవరినీ తీసుకురాలేదు అని ఆమె చెప్పిన పోలికలతో అలాంటి పాపే లేదని వారిస్తారు. దీనితో ఒకింత షాక్ తో లక్ష్మి కన్ఫ్యూజన్ లో పడుతుంది. మరి అక్కడ నుంచి పోలీస్ ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. మరి నిజంగానే లక్ష్మికి కూతురు ఉందా లేదా? ఈ ఇన్వెస్టిగేషన్ లో రామానుజం (ప్రకాష్ రాజ్) ఎవరు? చివరికి ఏమైంది అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

ఇప్పుడు వరకు ఒక నటిగా వరలక్ష్మి శరత్ కుమార్ అంటే అందరికీ ఒక ఐడియా ఉంది. కానీ ఈ సినిమాలో మాత్రం ఆమె ఒక నటిగానే కాకుండా దర్శకురాలిగా కూడా మెప్పించగలరు అని ప్రూవ్ చేసారని చెప్పొచ్చు. ఆమె ఈ సినిమాలో డిజైన్ చేసుకున్న కొన్ని సీన్స్ మరింత ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి.

ఇక నటిగా కూడా ఈ సినిమాలో ఆమె సాలిడ్ పెర్ఫామెన్స్ అందించారు. పలు ఎమోషనల్ వేరియేషన్స్ ని కూడా వరలక్ష్మి శరత్ కుమార్ తన పాత్రకి తగ్గట్టుగా బాగా చేశారు. అలాగే ఇన్వెస్టిగేషన్ సీన్స్ సహా కోర్ట్ సీన్స్ లో తన పొటెన్షియల్ ఆమె చూపించారు.

ఇక ఇతర నటులు ప్రియమణి, ప్రకాష్ రాజ్ ఇంకా రావు రమేష్ మరియు మురళీ శర్మ ల పాత్రలు బాగున్నాయి. వారి నటన కూడా అందులో పర్ఫెక్ట్ గా ఉంది. అలాగే ఈ సినిమాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ మంచి వెయిట్ ని తీసుకొస్తాయి.

మైనస్ పాయింట్స్:

ఈ కథ ఆసక్తికరంగానే మొదలైనప్పటికీ, సినిమా ముందుకు సాగుతున్న క్రమంలో మాత్రం కథనం ఊహాజనితంగానే మారడంతో ఆ ఇంపాక్ట్ మెల్లగా తగ్గుతుంది. ఒక డీసెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫస్టాఫ్ తర్వాత సెకండాఫ్ కొంచెం సాగదీతగా అనిపిస్తుంది.

ప్రముఖ నాజర్, మురళీ శర్మ, రాధికా శరత్ కుమార్ మరియు జీవా వంటి వారు ఇతర కీలక పాత్రల్లో కనిపించినప్పటికీ, వారి పాత్రలు సరిగ్గా డిజైన్ చేయకపోవడం వల్ల కథపై వారు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అలాగే ప్రకాష్ రాజ్ ఒక కీలక పాత్ర పోషించినప్పటికీ, ఆయన స్థాయికి తగ్గట్టుగా పవర్‌ఫుల్ కోర్టు రూమ్ సీన్స్‌లో నటించే అవకాశం కల్పించలేదు అనిపిస్తుంది.

అలానే కథనంలో కొన్ని సీన్స్ ని వరలక్ష్మి ఇంకా బెటర్ గా డిజైన్ చేయాల్సింది. ఉదాహరణకు, అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న ఒక లాయర్, కోర్టులో తన కేసును తనే వాదించుకోవడం వంటి సన్నివేశాలు సినిమా విశ్వసనీయతపై ప్రశ్నలు రేకెత్తించేలా చేస్తుంది.

వీటితో పాటుగా ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలను ఇంకా డెప్త్ తో కూడిన ఎమోషనల్ సీన్స్ ని డిజైన్ చేసుకుని ఉంటే ఇంపాక్ట్ ఇంకా బాగుండేది. అంతేకాకుండా, ఇలాంటి సీరియస్ కథనంలో పాటలను చేర్చడం వల్ల సినిమా ఫ్లో దెబ్బతిన్నట్లు అనిపిస్తుంది.

సాంకేతిక వర్గం:

ఈ సినిమాలో నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయి. ఏ ఎం ఎడ్విన్ సకాయ్ కెమెరా వర్క్ బాగుంది. థమన్ స్కోర్ కూడా బాగుంది కానీ కొన్ని సీన్స్ లో ఇంకా బెటర్ గా చేయాల్సింది. వెంకట్ రాజన్ ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్ గా కట్ చేయాల్సింది. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ విషయానికి వస్తే.. ఆమె తీసుకున్న అంశం, ఇందులో దర్శకత్వం ఇంప్రెస్ చేస్తాయి. అయితే మంచి ఎమోషన్స్ తో ఇన్వెస్టిగేషన్ ఇతర ఎమోషన్స్ ని పెట్టి ట్రై చేశారు. అయితే ఇంకా కొన్ని అంశాల్లో ఆమె బెటర్ గా ట్రై చేయాల్సింది. కానీ ఆమె ప్రయత్నానికి మంచి మార్కులు ఇవ్వొచ్చు.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ ‘ఎస్ సరస్వతి’ చిత్రంలో మంచి ఎమోషన్ అయితే ఉంది. కానీ కథనం ఇంకొంచెం బెటర్ గా డిజైన్ చేయాల్సింది. వరలక్ష్మి శరత్ కుమార్ ఒక పక్క నటిగా మరోపక్క దర్శకురాలిగా మంచి వర్క్ అందించే ప్రయత్నం చేశారు. కానీ ఊహాజనిత కథనం, లిమిటెడ్ స్కోప్ ఇంకా బలమైన సెకండాఫ్ లని ఇందులో డిజైన్ చేసి ఉంటే ఇంపాక్ట్ ఇంకా బెటర్ గా ఉండేది. వీటితో ఈ చిత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు