ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ చిత్రం AA23 గురించి ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ కోసం మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ క్రేజీ కాంబో సెట్ కావడంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి.
అయితే, ఈ సినిమా కోసం అనిరుధ్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం, ఈ ఒక్క సినిమా కోసమే అనిరుధ్ ఏకంగా రూ.25 కోట్లు పారితోషికంగా డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. సౌత్ ఇండియాలో ఒక సంగీత దర్శకుడికి ఈ స్థాయి రెమ్యూనరేషన్ అందడం ఇదే మొదటిసారి అని ట్రేడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా ఉన్న #AA23, లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ఉంటుందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అనిరుధ్ గతంలో లోకేష్‌తో కలిసి చేసిన ‘విక్రమ్’, ‘లియో’ వంటి చిత్రాలకు అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చి హిట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాకు కూడా అదే స్థాయి మ్యూజిక్ ఇస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.


