‘చెట్టు మీద దెయ్యం నాకేం భయం’ చిత్ర పోస్టర్ విడుదల.. పాత టైటిల్ వివాదంపై దర్శకుడి వివరణ

‘చెట్టు మీద దెయ్యం నాకేం భయం’ చిత్ర పోస్టర్ విడుదల.. పాత టైటిల్ వివాదంపై దర్శకుడి వివరణ

Published on Mar 9, 2026 6:00 AM IST

Chettu-Meeda

దర్శకుడు తల్లాడ సాయి కృష్ణ తన తదుపరి చిత్రం ‘చెట్టు మీద దెయ్యం నాకేం భయం’ కొత్త పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. ఇదే సమయంలో తన పాత సినిమా టైటిల్ ‘నరుడి బ్రతుకు నటన’ పారితోషికంపై హీరో సిద్ధు చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన వివరణ ఇచ్చారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘నరుడి బ్రతుకు నటన’ టైటిల్ కోసం తనకు కేవలం లక్ష రూపాయలు మాత్రమే ఇచ్చారని సాయి కృష్ణ తెలిపారు. ఇండస్ట్రీలో సత్సంబంధాల కోసం తాను మిగతా డబ్బులు అడగలేదని పేర్కొన్నారు. ఆ టైటిల్ కోసం డబ్బులు ఇచ్చి తీసుకున్నామని ఇటీవల హీరో సిద్ధు చెప్పారని, అయితే తనకు పూర్తి మొత్తం అందలేదన్న విషయం బహుశా ఆయనకు తెలిసి ఉండకపోవచ్చని సాయి కృష్ణ అభిప్రాయపడ్డారు.

ఇక శ్రీ లక్ష్మీ శ్రీనివాస ఫిల్మ్స్ బ్యానర్‌పై తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తున్న ‘చెట్టు మీద దెయ్యం నాకేం భయం’ చిత్రానికి సాయి కృష్ణ దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మాధురి, బాలు, రంజిత్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. హారర్, కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. చీకటి రాత్రి, ఒక పెద్ద చెట్టు, చేతిలో లాంతరు పట్టుకున్న హీరో.. వెనుక దెయ్యం ఉన్నట్లుగా ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు.

ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గణేష్ భారీ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. లలిత్ కిరణ్ సంగీతం అందిస్తుండగా, ఆడియో హక్కులను ‘శబరి మ్యూజిక్’ దక్కించుకుంది. అశోక్ నిమ్మల ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు