మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా హీరోయిన్ కయాదు లోహర్ హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం అయ్యిన లేటెస్ట్ సినిమానే “ఫంకీ”. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు అనుదీప్ కే వి తెరకెక్కించిన ఈ కామెడీ డ్రామా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీనితో ఇక అంతా ఓటీటీ రిలీజ్ కోసమే వైట్ చేశారు. మరి ఫైనల్ గా అఫీషియల్ ఓటీటీ డేట్ ఇపుడు వచ్చేసింది. ఈ సినిమా ఓటీటీ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
వారు ఇప్పుడు పాన్ ఇండియా భాషల్లో ఓటీటీ రిలీజ్ డేట్ ఇచ్చేసారు. ఈ మార్చ్ 13 నుంచి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంటుంది అని ఖరారు చేశారు. సో అప్పుడు మిస్ అయ్యి ఓటీటీలో చూద్దాం అనుకున్నవారు ఈ మార్చ్ 13 నుంచి చూడొచ్చు. అలాగే ఇతర భాషల ఆడియెన్స్ నుంచి కూడా ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహించారు.


