పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమానే ఉస్తాద్ భగత్ సింగ్. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ సాలిడ్ ఎంటర్టైనర్ సినిమాలో హీరోయిన్స్ గా శ్రీలీల, రాశిఖన్నా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో నుంచి ఆల్రెడీ రెండు సాంగ్స్ వచ్చి ఫ్యాన్స్ ని అలరించాయి. కానీ గతంలో వచ్చిన గబ్బర్ సింగ్ ఆల్బమ్ పెద్ద హిట్ అయ్యింది. పైగా ఆ ఆల్బమ్ లో ఐటమ్ సాంగ్ కూడా పెద్ద హిట్.
ఇపుడు మళ్లీ అలాంటి కలయికలో వస్తున్న ఈ సినిమాలో అదే తరహా ఐటెం సాంగ్ ని మళ్లీ చాలా మంది ఆశించవచ్చు. కానీ అలాంటివి ఏమీ లేవని హరీష్ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఒక ఐటెం గర్ల్ వెనకాల పడే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ని చూపించలేను అని ఇప్పుడు తనకి ఉన్న హోదా దృష్ట్యా అలాంటివి చేయడం సబబు కాదని హరీష్ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. సో మిగతా సినిమాల పరంగా ఏమో కాని తన కాంబినేషన్ లో ఇక నుంచి పవన్ సినిమాలు ఉంటే మాత్రం అలాంటి సాంగ్స్ ఉండకపోవచ్చనే చెప్పాలి.


