‘పుష్ప’ ఫేమస్‌ డైలాగ్‌ ఫస్ట్ నేనే చెప్పా – మంచు లక్ష్మి

‘పుష్ప’ ఫేమస్‌ డైలాగ్‌ ఫస్ట్ నేనే చెప్పా – మంచు లక్ష్మి

Published on Mar 9, 2026 1:09 PM IST

నటి మంచు లక్ష్మి కీలక పాత్ర పోషించిన సినిమా ‘లేచింది మహిళాలోకం’. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ ను నిర్వహించారు. కాగా, ఈ ఈవెంట్ లో ఆమె మాట్లాడుతూ.. ‘పుష్ప’ అంటే ఫ్లవర్‌ అనుకుంటివా ఫైర్‌.. ఈ డైలాగ్‌ ఎంత ఫేమస్‌ అయిందో అందరికి తెలుసు. ఐతే, నిజానికి ఈ డైలాగ్‌ను వేరే సినిమాలో నేను చెప్పాను. పైగా ఈ డైలాగ్ ను మొదటగా చెప్పింది కూడా నేనే’ అని నటి మంచు లక్ష్మి తెలిపారు.

ఈ అంశం పై మంచు లక్ష్మి ఇంకా మాట్లాడుతూ.. ‘ఇది ‘పుష్ప’ రిలీజ్‌కు ముందు పూర్తిచేసిన సినిమా. సుకుమార్‌ గారికి నేను చెప్పదలచుకుంది ఏంటంటే.. ఫ్లవర్‌ కాదు ఫైర్‌ అని ముందు నేనే చెప్పానండీ. కానీ, అప్పటికి మా డైలాగ్‌ విడుదల కాలేదు’ అని ఆమె తెలిపారు. ఇక ‘లేచింది మహిళాలోకం’ సినిమాలో మంచు లక్ష్మి పుష్ప పాత్రలో నటిస్తోంది. అలాగే, అనన్య నాగళ్ల, శ్రద్ధాదాస్‌, హరితేజ, హేమ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు.

తాజా వార్తలు