ఓటిటిలోకి వచ్చాక మంచి రెస్పాన్స్ అందుకుంటున్న లేటెస్ట్ రోమ్ కామ్ చిత్రం ‘విత్ లవ్’!

ఓటిటిలోకి వచ్చాక మంచి రెస్పాన్స్ అందుకుంటున్న లేటెస్ట్ రోమ్ కామ్ చిత్రం ‘విత్ లవ్’!

Published on Mar 10, 2026 3:10 PM IST

With Love Movie

రీసెంట్ గా కోలీవుడ్ సినిమా నుంచి వచ్చి అలరించిన పలు హిట్ చిత్రాల్లో బ్యూటిఫుల్ రోమ్ కామ్ చిత్రం విత్ లవ్ కూడా ఒకటి. యువ నటుడు, దర్శకుడు అబీషన్ జీవింత్ హీరోగా అనశ్వర రాజన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు మదన్ తెరకెక్కించగా తెలుగు సహా తమిళ్ లో ఆడియెన్స్ బాగా ఆదరించారు. ఇక లేటెస్ట్ గా ఓటిటిలోకి కూడా వచ్చిన ఈ సినిమాకి మరింత బెటర్ రెస్పాన్స్ ఆడియెన్స్ లో కనిపిస్తుంది.

మెయిన్ గా నెటిజన్స్ ఈ రోమ్ కామ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు ఉన్నారు. ఇందులో కొన్ని క్యూట్ మూమెంట్స్, లవ్ సీన్స్, ఎమోషన్స్ కి బాగా కనెక్ట్ అయ్యి సోషల్ మీడియాలో మొత్తం పాజిటివ్ రెస్పాన్స్ షేర్ చేసుకుంటున్నారు. ఇలా ఈ సినిమా ఓటిటిలోకి వచ్చాక కూడా మరింత మంచి సక్సెస్ ని అందుకుంది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి సౌందర్య రజనీకాంత్, మగేష్ రాజ్ పసిలియాన్ లు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు