షూటింగ్ ముగించుకున్న ‘డెకాయిట్’.. ఇక ప్రమోషన్స్ షురూ..!

షూటింగ్ ముగించుకున్న ‘డెకాయిట్’.. ఇక ప్రమోషన్స్ షురూ..!

Published on Mar 11, 2026 8:01 PM IST

Untitled 4 1

హీరో అడివి శేష్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘డెకాయిట్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను పూర్తి యాక్షన్ డ్రామాగా మేకర్స్ రూపొందిస్తున్నారు. షానీల్ డియో డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్‌కు పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ సినిమా షూటింగ్ గురించి మేకర్స్ ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.

‘డెకాయిట్’ చిత్ర షూటింగ్ ముగిసిందని మేకర్స్ తెలిపారు. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తిచేసి చిత్ర ప్రమోషన్స్‌ను మొదలుపెట్టేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాలో అడివి శేష్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంటాడని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అందాల భామ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, సునీల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వేసవి కానుకగా ఏప్రిల్ 10న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు